కొండచరియలు విరిగిపడి రహదారి కొట్టుకుపోయి ఏర్పడిన భారీ లోయ.. వీడియో ఇదిగో!
- అరుణాచల్ ప్రదేశ్లో ఎడతెరిపిలేని వానలు
- దిభాంగ్ లోయ జిల్లాలో కొట్టుకుపోయిన రహదారి
- మిగతా దేశంతో తెగిపోయిన సంబంధాలు
- పునరుద్ధరణకు మూడు రోజులు పడుతుందన్న అధికారులు
అరుణాచల్ ప్రదేశ్లో నిన్న కొండచరియలు విరిగిపడి చైనా సరిహద్దును కలిపే రహదారిలో కొంతభాగం కొట్టుకుపోయి పెద్ద లోయలా ఏర్పడింది. దిభాంగ్ లోయ జిల్లాను దేశంతో కలిపి ఈ రహదారి కొట్టుకుపోవడంతో సంబంధాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడడం కారణంగా ఈ రోడ్డుతోపాటు హన్లి, అనిని మధ్య రోయింగ్ అన్ని హైవే కూడా ధ్వంసమైంది.
ఈ ఘటనపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ్ ఖండూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయి. రోయింగ్ అనిని హైవేను మూడు రోజుల్లో పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే వరకు దిబాంగ్ వ్యాలీ వాసులు బయటకు రావొద్దని కోరారు.