సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినా ఓకే... వచ్చేసారి కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వమని చెప్పా: జగ్గారెడ్డి
- కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ ప్రారంభించిందన్న జగ్గారెడ్డి
- గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా వెనక్కి వస్తున్నారని వ్యాఖ్య
- సంగారెడ్డి ఎమ్మెల్యే వస్తానని చెబుతున్నారని దామోదర రాజనర్సింహ తనతో చెప్పారని వెల్లడి
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే చేర్చుకుంటామని... ఇదే విషయం తనను దామోదర రాజనర్సింహ అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని... అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కూడా ఆయనకే ఇవ్వమని చెప్పానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ ప్రారంభించిందన్నారు. రెండు రోజులుగా ఇదే జరుగుతోందని వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా వెనక్కి వస్తున్నారన్నారు. గతంలో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లను కూడా పార్టీలో చేర్చుకోవాలని అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెబుతున్నారని తనతో దామోదర రాజనర్సింహ చెప్పారని... అయితే వస్తే చేర్చుకుందామని స్పష్టం చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని... మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.