'తండేల్' ఓటీటీ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్!

  • షూటింగు దశలో ఉన్న 'తండేల్' 
  • చైతూ జోడీకట్టిన సాయిపల్లవి 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న దేవిశ్రీ 
  • 2018లో జరిగిన యథార్థ సంఘటనకి దృశ్యరూపం  

నాగచైతన్య - చందూ మొండేటి కాంబినేషన్లో 'తండేల్' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఈ సినిమా డిజిటల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడు కావడమే. 

ఈ సినిమా డిజిటల్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి గాను 40 కోట్లకి డీల్ కుదిరినట్టుగా చెబుతున్నారు. ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడవడం చైతూ కెరియర్లో ఇదే మొదటిసారి అని అంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 2018లో శ్రీకాకుళం జాలరుల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనకు ఇది దృశ్యరూపం. 

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలరులు చేపల వేట మొదలుపెడతారు. తమకి తెలియకుండానే వారు పాకిస్థాన్ సముద్ర జలాలలోకి ప్రవేశిస్తారు. దాంతో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. ఏడాదిన్నర పాటు వాళ్లు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎలా బయటికి వచ్చారనేదే కథ. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News