ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టుల హతం!
- నారాయణ్‌పూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
- ఘటనాస్థలి నుంచి భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న కాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్‌పూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.