పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో దిగిన మరో మెగా హీరో

  • పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
  • ఇప్పటికే పిఠాపురంలో భారీ రోడ్ షో నిర్వహించిన వరుణ్ తేజ్
  • తాజాగా వైష్ణవ్ తేజ్ రాక
  • మేనమామ విజయం కోసం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
జనసేనాని పవన్ కల్యాణ్ కోసం మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా పిఠాపురంలో దిగుతున్నారు. పవన్ ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బాబాయి కోసం వరుణ్ తేజ్ వచ్చి భారీ రోడ్ షో నిర్వహించి వెళ్లాడు. ఇప్పుడు మరో మెగా హీరో పిఠాపురం వచ్చాడు. 

ఈసారి వచ్చింది... పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యువ హీరో నేడు పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మేనమామకు విజయం చేకూర్చేలా ఆశీస్సులు అందజేయాలంటూ ప్రార్థించారు. 

ప్రస్తుతం పవన్ తరఫున నాగబాబు అర్ధాంగి కొణిదెల పద్మ ప్రచారం చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వైష్ణవ్ తేజ్... గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో కొండెవరం నుంచి ఉప్పాడ వరకు సాగనుంది.


More Telugu News