జాన్పూర్ లో బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మార్పు... సిట్టింగ్ కే మొగ్గు చూపిన మాయావతి

  • ఆఖరినిమిషంలో ఎంపీ అభ్యర్థిని మార్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
  • అంతకుముందు శ్రీకళారెడ్డి సింగ్ కు టికెట్ ఇచ్చిన మాయావతి
  • పోటీ చేసేందుకు సుముఖంగా లేనని చెప్పడంతోనే శ్యామ్ సింగ్ యాదవ్ కు టికెట్
ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చారు అక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్యామ్ సింగ్ యాదవ్. అంతకుముందు జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాఫియాడాన్ ధనుంజయ్ సింగ్ భార్య శ్రీకళా రెడ్డి సింగ్ ను బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో శ్రీకళారెడ్డి సింగ్ ను కాదని అదేస్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్యామ్ సింగ్ యాదవ్ పేరును పార్టీ అధ్యక్షరాలు మాయావతి ప్రకటించారు. నామినేషన్ దాఖలుకు సోమవారమే తుది గడువు కాగా, ఈ రోజే నామినేషన్ వేస్తున్నానని శ్యామ్ సింగ్ యాదవ్ తెలిపారు. కాగా, శ్రీకళా రెడ్డి సింగ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినందువల్లే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 




More Telugu News