ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో సేవల సమయం పొడిగింపు!

  • ఇవాళ్టి మ్యాచ్ సంద‌ర్భంగా మెట్రో రైళ్ల స‌మ‌యం పొడిగింపు
  • చివ‌రి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి ఒంటి గంట‌కు గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఎస్ఆర్‌హెచ్‌, ఎల్ఎస్‌జీ మ్యాచ్
మ‌రికొన్ని గంట‌ల్లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ‌ధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్ చూసేందుకు ఉప్ప‌ల్‌కు వ‌చ్చే క్రికెట్ అభిమానుల‌కు హైద‌రాబాద్ మెట్రో తీపి క‌బురు చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ మార్గంలో మెట్రో రైళ్ల‌ స‌మ‌యం పొడిగించింది. బుధ‌వారం మెట్రో రైళ్లు నిర్ణీత స‌మయానికి మించి న‌డుస్తాయ‌ని మెట్రో అధికారులు తెలిపారు. 

చివ‌రి మెట్రో రైళ్లు వాటి టెర్మిన‌ల్ నుంచి రాత్రి 12.15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి అర్ధ‌రాత్రి ఒంటి గంట‌కు త‌మ గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటాయ‌ని ప్ర‌క‌టించింది. నాగోల్‌, ఉప్ప‌ల్‌, స్టేడియం అండ్ ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్‌ల‌లో మాత్ర‌మే ప్ర‌వేశం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఇక రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఎస్ఆర్‌హెచ్‌, ఎల్ఎస్‌జీ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే అంతా సిద్ధ‌మైంది. 

మ్యాచుకు 3 గంట‌ల ముందు నుంచే ప్రేక్ష‌కుల‌ను స్టేడియం లోప‌లికి పంపించ‌నున్నారు. ఇక ఈ 17వ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచులు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ ఆరింటిలో గెలిచింది. దీంతో 12 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ మ్యాచులో గెలిస్తే ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మ‌రింత మెరుగవుతాయి.


More Telugu News