వాట్సాప్ లో చాలామందికి తెలియని సీక్రెట్ ఫీచర్

  • వాట్సాప్ చాట్‌లను లాక్ చేసే ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్
  • లాక్ చేసిన చాట్‌ను హైడ్ చేసేందుకు కూడా ఫీచర్
  • కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఒక ఇండియాలోనే ఏకంగా 50 కోట్లకుపైగా మంది వినియోగదారులు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న కస్టమర్ల అనుభూతిని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెట్టే వాట్సాప్ తాజాగా రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. కానీ వీటి గురించి చాలామందికి తెలియదు. వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చినా ఈ ఫీచర్ల గురించి అవగాహన లేదు. కొత్త ఫీచర్లలో ఒకటి యూజర్ల ‘సీక్రెట్ చాటింగ్‌’కు సంబంధించినది. కాగా రెండవది మరికొన్ని యూజర్ల అనుభూతిని మరింత పెంచేదిగా ఉంది.

చాలా మంది వాట్సప్ యూజర్లు తమ చాట్‌ని ఇతరులు చూడకూడదని, చదవకూడదని భావిస్తుంటారు.  ఇలా కోరుకునేవారి సమస్యను పరిష్కరిస్తూ ‘చాట్ లాక్’ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను యాప్‌లో సీక్రెట్‌గా దాచుకోవచ్చు. తద్వారా ఆయా చాట్‌లను ఎవరూ యాక్సెస్ పొందలేరు. 

ఈ కింద సూచించిన స్టెప్స్ అనుసరించి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు
1. ఎవరి చాట్‌ను సీక్రెట్‌గా దాచాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి.
2. కాంటాక్ట్ మీద ట్యాప్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఆన్ చేయాలి.
3. ‘చాట్ లాక్’ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇద్దరి మధ్య సంభాషణ యాప్‌లో లాక్ అవుతుంది.
4. తిరిగి ఆ చాట్‌ను చదవాలనుకుంటే అన్‌లాక్ చేస్తే సరిపోతుంది.
5. చాటింగ్ లాక్ అయ్యాక యాప్ పైభాగంలో ‘లాక్డ్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని అన్ లాక్ చేసి చదువుకోవచ్చు.

అంతేకాదు.. లాక్ చేసిన చాట్‌ను కూడా పూర్తిగా ఎవరికీ కనిపించకుండా దాచడానికి కూడా కొత్త ఫీచర్‌ను వాట్సప్ పరిచయం చేసింది. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది..

1. తొలుత కాంటాక్ట్‌ను చాట్ లాక్ చేయాల్సి ఉంటుంది.
2. వాట్సాప్ హోమ్ పేజీలో చాట్స్ పైభాగంలో ‘లాక్ చాట్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.
3. దానిపై ట్యాప్ చేసి లాక్డ్ చాట్స్ విభాగంలో ఎగువ కుడి వైపున మూడు చుక్కలు కనిపిస్తాయి.
4. ఈ చుక్కలపై ట్యాప్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
5. ‘హైడ్ లాక్డ్ చాట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ‘ఎనేబుల్’ చేయాలి.
6. ఎనేబుల్ చేయగానే సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సీక్రెడ్ కోడ్‌ని ఎంటర్ చేయాలి.
7. సూచించిన స్టెప్స్ అని అనుసరిస్తే హోమ్ పేజీలో ‘లాక్డ్ చాట్స్’ ఆప్షన్ కనిపించదు.

ఇక లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేయడానికి చాట్ లాక్ సెట్టింగ్‌లలో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా చాట్స్ కనిపిస్తాయి.


More Telugu News