ఒక్క మీటింగ్ తరువాత 500 మందిని తొలగించిన ఎలాన్ మస్క్!
- టెస్లా సూపర్ చార్జింగ్ విభాగంలో తొలగింపుల పర్వం
- మరిన్ని తొలగింపులు చేపట్టాలని మస్క్ సూచన
- మస్క్ సూచనకు టీం అధిపతి నిరాకరణ
- ఆ వెంటనే యావత్ టీంను తొలగించిన వైనం
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు తగ్గిన తరుణంలో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఒకేసారి 500 మందిని తొలగించారన్న వార్త సంచలనంగా మారింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు వెన్నెముకగా నిలుస్తున్న టెస్లా సూపర్‌చార్జర్ టీం అధిపతి సహా సభ్యులందరినీ మస్క్ ఓ కీలక మీటింగ్ తరువాత తొలగించినట్టు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవలే ఈ తొలగింపుల పర్వం చోటుచేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, గత వారం టెస్లా సూపర్ చార్జర్ డివిజన్ అధిపతి రిబెకా టినూచీతో మస్క్ ఓ కీలక సమావేశం నిర్వహించారు. అంతకుముందే, సూపర్ చార్జర్ టీంలో కొందరిని తొలగించాలని మస్క్ రెబెకాకు తెలిపారు. ఆ మేరకు కొందరిని తొలగించిన రెబెకా.. టీం తాజా పరిస్థితిపై మస్క్‌తో సమావేశమై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మరికొందరిని తొలగించాలన్న మస్క్ సూచనను రెబెకా తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఈ చర్యలతో టీం పనితీరు కుంటుపడుతుందని స్పష్టం చేసింది. కానీ మీటింగ్ పూర్తయన మరుసటి రోజే మొత్తం టీమ్ ఉద్వాసనకు గురికావడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు కీలకంగా మారిన సూపర్ చార్జింగ్ శాఖలోని వారందరినీ ఒకేసారి తొలగించడం సంచలనంగా మారింది. ఈ విభాగం ఆధ్వర్యంలోనే అమెరికాలో టెస్లా పలు సూపర్ చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తుంటుంది. అయితే, ఇకపై ఈ శాఖ బాధ్యతలను టెస్లా ఎనర్జీ టీం చూస్తుందని సమాచారం.
విద్యుత్ వాహనాల రంగంలో చైనా కంపెనీల నుంచి ఎలాన్ మస్క్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు డిమాండ్ తగ్గుతోందని కూడా టెస్లా పేర్కొంది. ఈ నేపథ్యంలో మస్క్ ప్రాధాన్యాల్లో మార్పు వచ్చింది. ఇకపై తాము స్వయంచాలిత వాహనాల అభివృద్ధిపైనే దృష్టి పెడతామని మస్క్ ఇటీవల ప్రకటించారు. స్వయంచాలిత వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉన్నా మస్క్ ఈ రంగంవైపే మొగ్గు చూపడం గమనార్హం.