విజ‌య‌శాంతి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  • తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య‌
  • అలా అనడం సమంజసం కాదన్న విజ‌య‌శాంతి 
  • అది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని వెల్లడి  
'తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు' అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆమె 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని తెలిపారు. ఇది అర్థం కాని వారు.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్దే, జయలలితల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ ఇచ్చిన రాజకీయ సమాధానం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన చేయలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తుందన్నారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దక్షిణాది ఉన్న ప్రేమతో కౌంటర్ ఇచ్చారా? లేక కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించట్లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


More Telugu News