పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమించిన ఎన్నికల సంఘం
- ఏపీలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత హింస
- పల్నాడు కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని బదిలీ చేసిన ఈసీ
- అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
- పల్నాడు నూతన కలెక్టర్ గా శ్రీకేశ్ బాలాజీ లట్కర్ నియామకం
- కాసేపట్లో తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.