స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన షారుఖ్ ఖాన్

  • కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ కు హాజరైన బాద్ షా
  • మ్యాచ్ అనంతరం అస్వస్థతకు గురైన షారుఖ్
  • అహ్మదాబాద్ లోని కె.డి. ఆసుపత్రిలో చేరిక
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ కు షారుఖ్ తన పిల్లలతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ పూర్తయ్యాక ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. షారుఖ్ కు వడదెబ్బ తగిలినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను షారుఖ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మంగళవారం నరేంద్ర మోదీ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టుతో కేకేఆర్ క్వాలిఫయర్ మ్యాచ్ జరగడంతో షారుఖ్ హాజరయ్యారు. తన జట్టు మ్యాచ్ గెలిచిన తర్వాత షారుఖ్ పిల్లలతో కలిసి మైదానంలోకి వెళ్లి అభిమానులకు అభివాదం చేశాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ అహ్మదాబాద్ లోని కె.డి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆయన హెల్త్ అప్ డేట్ గురించి ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. షారుఖ్ ఆసుపత్రిలో చేరడంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


More Telugu News