టీ20 ప్రపంచకప్‌లో తిరుగులేని భారత్.. ఆ జట్లపై మాత్రం అందని విజయాలు

  • జూన్ 5 తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ ఢీ
  • ఈసారి టైటిల్‌పై కన్నేసిన రోహిత్ సేన
  • టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని రికార్డు
  • న్యూజిలాండ్, శ్రీలంకపై అందని విజయాలు
టీ20 ప్రపంచకప్ సమరాంగానికి సర్వం సిద్ధమైంది. జూన్ 5న న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో తలపడనున్న భారత జట్టు ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ జట్టుగా, ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ టైటిల్‌పై కన్నేసింది. గ్రూప్-ఎలో యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్‌తో ఉన్న భారత్ సూపర్-8లోకి వెళ్లడం నల్లేరు మీద నడకే. 2007లో ప్రారంభ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా 2014లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, గత మూడు ఎడిషన్లలో మాత్రం రోహిత్ సేన తడబడుతోంది. 

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఘనమైన రికార్డులు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. అయితే, న్యూజిలాండ్, శ్రీలంకపై మాత్రం విజయం అందని ద్రాక్షగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు 44 మ్యాచ్‌లు ఆడగా 28 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 14 వేర్వేరు జట్లతో ఆడిన టీమిండియా.. 7 జట్లపై తిరుగులేని రికార్డులు సొంతం చేసుకుంది. 

భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడగా ఆరుసార్లు భారత్‌దే పైచేయి అయింది. బంగ్లాదేశ్‌తో తలపడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆరుసార్లు తలపడగా నాలుగింటిలో గెలుపొందింది. అయితే, పెద్ద జట్లపై మాత్రం భారత ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వెస్టిండీస్‌తో నాలుగుసార్లు తలపడగా ఒక్కసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.
ప్రత్యర్థి 
  మ్యాచ్‌లు 
విజయాలు 
ఓడినవి 
డ్రా 
ఆస్ట్రేలియా 
5320
ఇంగ్లండ్4220
న్యూజిలాండ్ 
3030
సౌతాఫ్రికా6420
పాకిస్థాన్7610
వెస్టిండీస్4130
శ్రీలంక2020
బంగ్లాదేశ్4400
ఆఫ్ఘనిస్థాన్3300
జింబాబ్వే1100
స్కాట్లాండ్2101
నెదర్లాండ్స్1100
నమీబియా1100
ఐర్లాండ్ 1100
 



More Telugu News