ఎన్డీయేకు మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందించాం: ప్రధాని మోదీ

  • ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తామన్న మోదీ
  • ఎన్డీయేకు దేశ ప్రజలు మూడోసారి అవకాశమిచ్చారన్న మోదీ
  • దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు తమను ఆశీర్వదించారన్న ప్రధాని
ఎన్డీయేకు మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ... ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే అన్నారు. ఎన్డీయేకు దేశ ప్రజలు మూడోసారి అవకాశమిచ్చారన్నారు. దేశానికి మరింత సేవ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు.

ఎల్లుండి జూన్ 9న సాయంత్రం 6 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు... కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 


More Telugu News