గత ప్రభుత్వంలోని పలు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు

  • ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం
  • జగనన్న, వైఎస్సార్ పేరుతో ఉన్న పలు పథకాలకు పేరు మార్పు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
గత ప్రభుత్వంలోని పలు పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు సర్కారు
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లపై దృష్టి సారించింది. వివిధ పథకాలకు పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై 'పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్' గా పిలుస్తారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి'గా పేరు మార్చారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి 'చంద్రన్న పెళ్లి కానుక'గా  పేరు మార్చారు. 

వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి 'ఎన్టీఆర్ విద్యోన్నతి' అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం పేరును కూడా మార్చారు. ఈ పథకానికి 'సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకం'గా నామకరణం చేశారు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News