సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

  • జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ద్వివేదికి ఆదేశాలు
  • గతంలో వివాదాస్పద అధికారిగా గుర్తింపు ఉన్న ద్వివేది
  • గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగుల అంశంలో ద్వివేదిపై విమర్శలు
  • ఇటీవల కార్మిక శాఖకు బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం
  • కొన్ని రోజులకే మళ్లీ స్థానచలనం
సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ద్వివేదిని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక... ద్వివేదిని వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మిక శాఖకు బదిలీ చేశారు. ద్వివేది వ్యవహార శైలి గతంలో వివాదాస్పదమైన నేపథ్యంలో... ఈ నియామకం ఆశ్చర్యానికి గురిచేసింది. 

గతంలో గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగుల అంశంలో ద్వివేది తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నిరోజుల వ్యవధిలోనే ద్వివేదికి రెండోసారి స్థానచలనం తప్పలేదు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి నాయక్ కు కార్మికశాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.


More Telugu News