జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు టీమిండియాలో ఆ ముగ్గురికి చోటు

  • జులై 6 నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన
  • టీమిండియా, జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • శివమ్ దూబే, శాంసన్, యశస్వి స్థానంలో జితేశ్, హర్షిత్, సాయిసుదర్శన్ లకు చోటు
టీమిండియా జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పయనమైంది. ఈ జట్టుకు శుభ్ మాన్ గిల్  కెప్టెన్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 

టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య జులై 6 నుంచి 14వ తేదీ వరకు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా, జింబాబ్వే పర్యటనలో తొలి రెండు టీ20ల్లో ఆడే టీమిండియాలో మరో ముగ్గురు ఆటగాళ్లకు చోటు కల్పిస్తున్నట్టు బీసీసీఐ నేడు ప్రకటించింది. 

ఐపీఎల్ లో విశేషంగా రాణించిన సాయి సుదర్శన్ (బ్యాటర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్ బ్యాట్స్ మన్), హర్షిత్ రాణా (బౌలర్) జింబాబ్వే పర్యటనలో పాల్గొనే టీమిండియాకు ఎంపికయ్యారని వివరించింది. 

టీ20 వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియా సభ్యులు శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినట్టు బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది.

జింబాబ్వే పర్యటనలో ఆడే టీమిండియా....

శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హర్షిత్ రాణా.


More Telugu News