వైఎస్సార్ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదు: మాజీ మంత్రి జోగి రమేశ్
- తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
- వైఎస్సార్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బతికిందన్న జోగి రమేశ్
- రాష్ట్రంలో వైసీపీకి కాంగ్రెస్ పార్టీ అసలు పోటీయే కాదని వ్యాఖ్య
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదన్నారు. ఆయన జయంతిని ఎవరైనా చేసుకోవచ్చని తెలిపారు. వైఎస్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కీర్తించొచ్చని చెప్పారు.
వైఎస్సార్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బతికిందన్నారు. తెలంగాణలో కాదని, దేశం మొత్తం వైఎస్ జయంతి చేసినా ఆయన రుణం కాంగ్రెస్ తీర్చుకోలేదని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో వైసీపీకి కాంగ్రెస్ పార్టీ అసలు పోటీయే కాదన్నారు. ఆ పార్టీకి ఏపీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికి తెలుసంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీతో వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. తమ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పిన మాజీ మంత్రి.. మళ్లీ తప్పకుండా అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.