పేరు మార్చుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు

పేరు మార్చుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తన పేరును ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. తన పేరు మార్పు గురించి ఆకాశ్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. "నా పేరులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు నా పేరు ఆకాశ్ పూరీ కాదు... ఇప్పటి నుంచి నేను ఆకాశ్ జగన్నాథ్" అని ప్రకటించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అభిమానులు ఆకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆకాశ్ జగన్నాథ్... తన తండ్రి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత, బుజ్జిగాడు సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. హీరోగా పరిచయం అయిన మొట్టమొదటి చిత్రం ఆంధ్రా పోరీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా చేసినప్పటికీ ఏమంత సక్సెస్ అందుకోలేకపోయాడు.


More Telugu News