ఫిర్యాదులు రాకుండానే ధనుష్‌పై చర్యలా?.. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ఖండించిన నటుడు కార్తి
- నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ అన్న నిర్మాతల మండలి
- ధనుష్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
- నిర్మాతల సంఘం ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేశామన్న కార్తి
తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ప్రముఖ నటుడు, నడిగర్ సంఘం కోశాధికారి కార్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నవంబర్ 1 తర్వాత సినిమా షూటింగ్‌లకు అనుమతి లేదన్న నిర్ణయాన్ని ఖండించాడు. ఇది వేలాది కార్మికులకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు.
డబ్బులు తీసుకుని కూడా సినిమా షూటింగ్‌లకు ధనుష్ హాజరు కావడం లేదని అంటున్నారని, కానీ ఇప్పటి వరకు ఆయనపై నడిగర్ సంఘానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అలాంటప్పుడు ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
సినీ నిర్మాతల మండలి నిర్ణయాన్ని సంఘం తరపున పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, నిర్మాతల సంఘం లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానాలతో నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే దానిని విడుదల చేస్తామని కార్తీ తెలిపారు.