టీటీడీలో రూ.100 కోట్ల అవినీతి: చింతా మోహన్

––
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వైసీపీ పాలనలో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. భక్తులు శ్రీవారి హుండీలలో వేసిన సొమ్మును అపవిత్రం చేశారని మండిపడ్డారు. టీటీడీ సొమ్మును ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని విమర్శించారు. ఆరు నెలల కిందట టీటీడీలో రూ.100 కోట్లు చేతులు మారాయని చింతా మోహన్ చెప్పారు. సత్రాల నిర్మాణం కోసం రూ.1200 కోట్లతో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారని గుర్తుచేశారు. అదేవిధంగా, తిరుపతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, కాంట్రాక్టు విషయంలో వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో విచారణ జరిపించాలని చింతా మోహన్ డిమాండ్‌ చేశారు.


More Telugu News