ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది చిరంజీవి చ‌ల‌వే: పొన్నాంబళం

  • నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు
  • చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన పొన్నాంబ‌ళం
  • చిరంజీవితో క‌లిసి న‌టించిన రోజుల‌ను గుర్తు చేసిన న‌టుడు 
  • తాను అనారోగ్యానికి గురైన స‌మ‌యంలో చిరు రూ. 60 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ని వెల్ల‌డి
నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు. దీంతో అభిమానులు చిరు బ‌ర్త్‌డే వేడుకల‌ను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌మిళ న‌టుడు పొన్నాంబ‌ళం చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. మెగాస్టార్ బ‌ర్త్‌డే నేప‌థ్యంలో న‌గ‌రంలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా పొన్నాంబ‌ళం మాట్లాడుతూ.. "ఈరోజు హైదరాబాదులో చిరంజీవి బర్త్ డే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు 1500 సినిమాల్లో ఫైట్స్ చేశాను. ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీ వ‌దిలేస్తాన‌ని అప్పుడు చెప్పాను.

1985- 86 రోజుల్లో మాకు రోజువారీ పారితోషకంగా రూ. 350 ఇచ్చేవారు. కానీ, చిరంజీవి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఫైటర్స్ కి ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున‌ ఇచ్చేవారు. ఇక నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి ఇప్పటివరకు రూ. 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి చ‌ల‌వే. ఈ జీవితం ఆయ‌న ఇచ్చిందే" అని పొన్నాంబ‌ళం చెప్పుకొచ్చారు.


More Telugu News