తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
- డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడి
- ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ
- 783 పోస్టులకు ఐదున్నర లక్షలమంది దరఖాస్తు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. టీజీపీఎస్సీ గురువారం నాడు షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం... రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు.
783 గ్రూప్-2 పోస్టులకు షెడ్యూల్ ప్రకారం ఈ నెలలోనే పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. అయితే డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.