అలాంటి వారి కోసం అన్వేషిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

 
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పాటుపడే వారి కోసం అన్వేషిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతిభావంతుల నుంచి సెప్టెంబరు 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. 

హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని లోకేశ్ వివరించారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రణాళిక రూపొందించాల్సి ఉందని... కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఈడీబీ (ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్)ని కోరుతున్నామని తెలిపారు.


More Telugu News