హైదరాబాద్‌ను దేశానికి క్రీడారాజధానిగా మార్చాలనేదే మా ప్రయత్నం: రేవంత్ రెడ్డి

  • హైదరాబాదులో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్ బాల్ టోర్నీ 
  • తెలంగాణ తరఫున జట్లకు, ఆటగాళ్లకు స్వాగతం పలికిన సీఎం
  • హైదరాబాద్‌లో టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
హైదరాబాద్‌ను భారతదేశానికి క్రీడా రాజధానిగా మార్చాలనేది తమ ప్రయత్నమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్, తెలంగాణ ఫుట్‌బాల్ ప్రేమికుల తరఫున, ప్రజలందరి తరఫున ఆయన అన్ని జట్లకు స్వాగతం పలికారు.

పలు దేశాలతో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడటానికి వచ్చిన అన్ని జట్లలోని ఆటగాళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈరోజు ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో ఇండియా, మారిషస్, సిరియా పాల్గొంటున్నాయి.


More Telugu News