ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కుండపోత వర్షం

  • ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు
  • తిరువూరు పట్టణం జలమయం
  • మెయిన్ రోడ్డుపై ప్రవహించిన నీరు... నిలిచిపోయిన వాహనాలు
  • విజయవాడలో వర్షంలోనే పర్యటించిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లాను భారీ వర్షాలు వీడడంలేదు. ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో కుండపోతగా వర్షం కురిసింది. తిరువూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయం అయ్యాయి. 

తిరువూరు మెయిన్ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు, తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు పడడంతో భారీగా వస్తున్న నీటితో ఎన్టీఆర్ జిల్లాలోని వాగుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. కట్లేరు, ఎదుళ్ల, గుర్రపుకొండ, అలుగు, పడమటి, విప్ర వాగులు ఉప్పొంగుతున్నాయి. 

విజయవాడలోనూ ఈ సాయంత్రం భారీ వర్షం పడడంతో సీఎం చంద్రబాబు వర్షంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలకు ఆయన జేసీబీ ఎక్కి వెళ్లారు. వరద సహాయం అందుతున్న తీరును స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.


More Telugu News