తన బెస్ట్ ఫ్రెండ్ 'టిక్కి'ని పరిచయం చేసిన మంచు విష్ణు

  • తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పతో మంచు విష్ణు బిజీ
  • సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు
  • కన్నప్పలో నా సోదరుడు, బెస్ట్ ఫ్రెండ్ అంటూ తన గుర్రాన్ని పరిచయం చేసిన విష్ణు
కన్నప్ప వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్టుతో అభిమానులను పలకరించారు. ఓ గుర్రంపై తాను స్వారీ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. 

"దీని పేరు 'టిక్కి'. కన్నప్ప చిత్రంలో  ఇది నా సోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్. నిజ జీవితానికి వస్తే... ఇదొక అద్భుతమైన అశ్వం. మునుపెన్నడూ చేయనటువంటి స్టంట్స్ కన్నప్ప చిత్రంలో చేయగలిగానంటే 'టిక్కి'నే కారణం" అని మంచు విష్ణు వివరించారు.


More Telugu News