వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో ఇద్దరు కీలక నేతలు
- నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైసీపీ డీలా
- తాజాగా పార్టీని వీడిన బాలినేని, సామినేని
- ఇదే బాటలో గ్రంధి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు
వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెపుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారు. ఇదే దారిలో మరికొందరు నేతలు అడుగులు వేస్తున్నారు.
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా త్వరలోనే వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆళ్లనాని పార్టీకి రాజీనామా చేయడమే కాక... రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు.