హీరోయిన్ జెత్వానీ కేసు... రిమాండ్ ను కోర్టులో సవాల్ చేసిన విద్యాసాగర్

  • జెత్వానీ కేసులో ఏ1గా కుక్కల విద్యాసాగర్
  • డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • అక్టోబర్ 4వ తేదీ వరకు విద్యాసాగర్ కు రిమాండ్
ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కు విజయవాడలోని మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తనకు విధించిన రిమాండ్ ను ఏపీ హైకోర్టులో విద్యాసాగర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసాగర్ రిమాండ్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు ఇదే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లోని ఓ రిసార్టులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది.


More Telugu News