పినిపె శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు: నారా లోకేశ్

  • దుర్గాప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారన్న లోకేశ్
  • వైసీపీ ప్రభుత్వం హింస సంస్కృతిని పోషించిందని విమర్శ
  • శ్రీకాంత్ ను మధురైలో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో పినిపె శ్రీకాంత్, వడ్డి ధర్మేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దుర్గాప్రసాద్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక హత్య చేశారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం హింస సంస్కృతిని పెంచి పోషించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో దుర్గాప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. 

కోనసీమ జిల్లా అయినవిల్లిలో 2022 జూన్ 6న దుర్గాప్రసాద్ ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేశ్ ను గత నెల 18న అరెస్ట్ చేశారు. ఈరోజు శ్రీకాంత్ ను తమిళనాడులోని మధురైలో అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై ఆయనను ఏపీకి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అనే సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


More Telugu News