కామ‌న్వెల్త్ క్రీడ‌ల నుంచి ప‌లు ఆట‌లు తొల‌గింపు

  • గ్లాస్గో వేదిక‌గా 2026 కామ‌న్వెల్త్ క్రీడ‌లు
  • బ్యాడ్మింట‌న్‌, హాకీ, క్రికెట్‌, స్క్వాష్, రెజ్లింగ్ త‌దిత‌ర క్రీడ‌ల తొల‌గింపు
  • ఈసారి వ్య‌యాన్ని త‌గ్గించుకోవాల‌ని 10 ఈవెంట్లు మాత్ర‌మే నిర్వ‌హణ‌
  • ఈ మేర‌కు కామ‌న్వెల్త్ క్రీడ‌ల స‌మాఖ్య తాజాగా ప్ర‌క‌ట‌న‌
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జ‌రిగే 2026 కామ‌న్వెల్త్ క్రీడ‌ల నుంచి ప‌లు ఆట‌ల‌ను తొల‌గిస్తూ కామ‌న్వెల్త్ క్రీడ‌ల స‌మాఖ్య తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. బ్యాడ్మింట‌న్‌, హాకీ, క్రికెట్‌, స్క్వాష్, రెజ్లింగ్‌, టేబుల్ టెన్నిస్‌, రోడ్ రేసింగ్‌, నెట్ బాల్‌, షూటింగ్‌ల‌ను తొల‌గించింది. 

కాగా, 2022లో బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రిగిన కామ‌న్వెల్త్ క్రీడల్లో స‌మాఖ్య 19 ఈవెంట్‌ల‌ను నిర్వ‌హించింది. అయితే, ఈసారి వ్య‌యాన్ని త‌గ్గించుకోవాల‌నే ఉద్దేశంతో 10 ఈవెంట్లు మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 

ఇక 2022 కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త క్రీడాకారులు అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. భార‌త్ మొత్తం 61 ప‌త‌కాలు కొల్ల‌గొట్టింది. ఇందులో 22 గోల్డ్‌, 16 సిల్వ‌ర్‌, 23 బ్రాంజ్ మెడ‌ల్స్ ఉన్నాయి. దీంతో ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్‌ నాలుగో స్థానం కైవ‌సం చేసుకుంది. 


More Telugu News