ఆ భూములతో నాకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్న విజయసాయిరెడ్డి
- ప్లాంట్ ను రక్షించుకునేందుకు ఆమరణ దీక్ష కూడా చేస్తామని వ్యాఖ్య
- ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న విజయసాయి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
100 రోజుల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని విజయసాయి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఎన్సీసీ, దసపల్లా భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు జరిగిందని చెప్పారు.