తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాలకు అనుమతులు రద్దు

  • గత ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి లీజుకు భూమి కేటాయింపు
  • నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం
  • చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించిన దేవాదాయ శాఖ కార్యదర్శి
విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదురుగాలి వీస్తోంది. తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాలకు ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతులు రద్దు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో భూమి లీజుకు ఇచ్చారు. 

అయితే, నిబంధనలను అతిక్రమిస్తూ శారదా పీఠం అక్కడ భవనాలు నిర్మిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.


More Telugu News