నాలుగు నెలల క్రితం మిస్సయిన యూపీ మహిళ.. కాన్పూరులోని మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో మృతదేహం
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- ఈ ఏడాది జూన్ 24న అదృశ్యమైన మహిళ
- పెళ్లి విషయంలో వాగ్వివాదం జరగడంతో ఆమెను కొట్టి చంపిన జిమ్ ట్రైనర్
నాలుగు నెలల క్రితం అదృశ్యమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య మృతదేహం తాజాగా కాన్పూరు జిల్లాలోని మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో లభ్యమైంది. ఈ కేసులో కాన్పూరులోని రాయ్పుర్వా ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించడంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తానే చంపి పూడ్చిపెట్టానని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ ఈ ఏడాది జూన్ 24న అదృశ్యమైంది. జిమ్ ట్రైనర్‌కు పెళ్లి నిశ్చయమైనట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడిని కలిసేందుకు జిమ్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి విషయమై వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు ఆమె మెడ వెనక బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టేశాడు.
అతడు ఆ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలను పూణె, ఆగ్రా, పంజాబ్ పంపారు. కాగా, ఆ సమయంలో బాధిత మహిళ ధరించిన ఆభరణాలను నిందితుడు తీసుకున్నదీ, లేనిదీ నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.