రేణుదేశాయ్ సంస్థకు రామ్‌చరణ్ భార్య ఉపాసన సాయం
- మూగజీవాల సంరక్షణకు సంస్థను ఏర్పాటు చేసిన రేణుదేశాయ్
- అంబులెన్స్‌ను కొనుగోలు చేసిన నటి
- దాని కోసం ఉపాసన సాయం చేసినట్టు వెల్లడి
రేణుదేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థకు సినీ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన తన సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఉపాసన సాయం అందించినట్టు పేర్కొన్నారు.
ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, దీనికి ఉపాసన తనవంతు సాయం అందించారని రేణు తెలిపారు. రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ సాయం చేసినట్టు తెలిపారు. అంబులెన్స్ కొనుగోలు చేసేందుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు అని రేణుదేశాయ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఉపాసనను ట్యాగ్ చేశారు.
కాగా, తన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రాంలో రేణుదేశాయ్ విజ్ఞప్తి చేశారు. తమవంతు బాధ్యతగా ఎవరైనా ప్రతి నెల కనీసం రూ. 100 కూడా సాయం చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని, తాను స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని తనకు చిన్నప్పటి నుంచి కోరిక అని రేణు వివరించారు.