ఏపీ మంత్రి వాసంశెట్టికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- మంత్రి వాసంశెట్టి సుభాశ్ హజరైన కార్యక్రమంలో ఒరిగిన వేదిక
- కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఘటన
- మంత్రి పడిపోతుండగా పట్టుకున్న భద్రతా సిబ్బంది, అనుచరులు
సభలు, సమావేశాల నిర్వహణ సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తున్నా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేదికపైకి సామర్థ్యానికి మించి కార్యకర్తలు ఎక్కుతుండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధాన నాయకుడితో పెద్ద సంఖ్యలో అనుచరగణం వేదికపైకి వస్తున్న క్రమంలో నిర్వాహకులు నిలువరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ హజరైన వేదికపై ప్రమాదం తప్పింది.
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో శెట్టిబలిజ సామాజికవర్గం వారు ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగిస్తుండగా, వేదిక ఒక్కసారిగా ఒరిగింది. దీంతో మంత్రి సుభాశ్ కిందపడిపోబోతుండగా, భద్రతా సిబ్బంది, అనుచరులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. మంత్రి సుభాశ్ కు త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో తర్వాత మరో వైదికపై నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.