ఇంకా 35 రోజులే మిగిలాయి.. మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్: కేటీఆర్
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చే నెలకు ఏడాది పూర్తి
- గ్యారెంటీ హామీలను కూడా అమలుచెయ్యలేదని కేటీఆర్ విమర్శ
- ఏడాదికి ఇంకా 35 రోజులే మిగిలాయని హామీల అమలు ఎప్పుడంటూ కేటీఆర్ నిలదీత
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
“వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్. మూడు వందల ముప్పై రోజులు ముగిసింది. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే - చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిన మూసీ సర్కార్. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప? జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
ఇలా కేటీఆర్ లేవనెత్తిన పలు అంశాలతో కూడిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- * ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది-2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది - ఎకరాకు రూ. 15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది - పెంచిన రూ. 4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది- నెల నెలా ఇస్తామన్న రూ. 2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది- పెంచి ఇస్తామన్న రూ. 6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యాంగ అన్నలు, అక్కలు
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది- ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది- కౌలు రైతులు రూ. 15000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12000 ఎక్కడ అంటున్నారు
- * ఏడాదికి 35 రోజులే మిగిలింది- తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు
ఇలా కేటీఆర్ లేవనెత్తిన పలు అంశాలతో కూడిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.