కోహ్లీకి ఊహించని వ్యక్తి నుంచి బర్త్ డే విషెస్

  • విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఇటలీకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి అగాటా ఇసాబెల్లా సెంటాస్సో
  • అగాటా తెలిపిన బర్త్ డే విషెస్‌పై నెటిజన్ల విమర్శలు
  • తప్పుగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన అగాటా  
భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఊహించని వ్యక్తి నుంచి బర్త్ డే విషెస్ రావడం తీవ్ర సంచలనం అయింది. విరాట్ కోహ్లీకి అనేక మంది ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత్ నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇటలీకి చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణి కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఇటలీలోని ఓ అభిమాని నుంచి మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆల్ ది బెస్ట్ అంటూ ఫుట్‌బాల్ క్రీడాకారిణి అగాటా ఇసాబెల్లా సెంటాస్సో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఆమె స్పందించింది. తాను క్రికెట్ లేదా విరాట్ కోహ్లీ గురించి పోస్టు పెట్టిన ప్రతిసారీ ఇలానే జరుగుతోందని, తప్పుగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారని ప్రశ్నించింది. నిజాయితీగా చెబుతున్నా ఎందుకు అలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు పేర్కొంది. 


More Telugu News