మహారాష్ట్రలో ఓటమికి తోడు కాంగ్రెస్ కూటమికి మరో ఘోర పరాభవం!

  • ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు కూడా దక్కించుకోలేని కూటమి పార్టీలు
  • ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఓ పార్టీకి 10 శాతం లేదా 29 సీట్లు రావాల్సిన వైనం
  • ప్రతిపక్ష కూటమిలోని ఏ పార్టీకి దక్కని పది శాతం సీట్లు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఏ) ఘోరంగా ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ కూటమికి అంతకుమించి పరాభవం ఎదురైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ (మహా వికాస్ అఘాడీ) కూటమి 50 స్థానాలు మించి గెలుచుకోలేకపోయింది.

ప్రతిపక్ష హోదా దక్కాలంటే 288 అసెంబ్లీ స్థానాల్లో 10 శాతం లేదా 29 సీట్లు సాధించాలి. కానీ మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఏ పార్టీ కూడా ఒంటరిగా 29 సీట్లు గెలవలేదు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు, సమాజ్‌వాది పార్టీ 2, సీపీఎం, పీసాంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలు చెరో సీటును గెలుచుకున్నాయి. ఏ ఒక్క పార్టీకి 29 సీట్లు రాకపోవడంతో ఎంవీఏ కూటమిలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కనిపించడం లేదు.


More Telugu News