2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీకి కోలుకోలేని ఎదురుదెబ్బ.. 34 ఏళ్ల తర్వాత తొలిసారి బెలాగంజ్‌లో ఓటమి
- రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు
- బెలాగంజ్‌లో 1990 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఆర్జేడీ
- తండ్రి సురేంద్ర యాదవ్ వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోయిన కుమారుడు విశ్వనాథ్
- పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ ఓడిన లాలూ ప్రసాద్ పార్టీ
- బెలాగంజ్‌లో మొత్తానికి సత్తా చాటిన నితీశ్ కుమార్ జేడీయూ
వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని నాలుగు స్థానాలు.. బెలాగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీలో ఉప ఎన్నికలు జరిగాయి. వచ్చే ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్‌గా అభివర్ణించారు. ఈ ఉప ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ ఎన్డీయే విజయం సాధించింది.
మరీ ముఖ్యంగా ఆర్జేడీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓటమి పాలైన నాలుగు స్థానాల్లో రెండింటిలో అంటే బెలాగంజ్, రామ్‌గఢ్ ఇప్పటి వరకూ ఆర్జేడీ ఖాతాలో ఉండేవి. ఇప్పుడీ రెండు స్థానాలనూ ఆర్జేడీ కోల్పోయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బెలాగంజ్‌లో ఆ పార్టీకి తీరని ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఆ పార్టీకి ముఖ్యమైన సీటు. ఇక్కడ ఆర్జేడీ నేత సురేంద్ర యాదవ్ 1990 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దాదాపు 34 సంవత్సరాలపాటు ఆయన ఆ స్థానాన్ని తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఇప్పుడా సీటును కోల్పోవడం ఆర్జేడీకి భారీ షాకేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో జెహానాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సురేంద్రయాదవ్ ఎంపీగా ఎన్నికవడంతో ఆయన కుమారుడు విశ్వనాథ్ యాదవ్‌ను ఆర్జేడీ ఈ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపింది. అయితే, తండ్రి వారసత్వాన్ని కొనసాగించడంలో విశ్వనాథ్ విఫలమయ్యారు. 8 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ స్థానం కోసం జేడీయూ ప్రతిసారీ పోటీ పడుతున్నా విజయం సాధించలేకపోయింది. కానీ, ఈసారి మాత్రం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పార్టీ విజయం సాధించింది.