భర్త కేఎల్ రాహుల్‌పై అథియా శెట్టి ప్రశంసల జల్లు
- పెర్త్ వేదికగా భారత్, ఆసీస్ తొలి టెస్టు
- హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్
- గత కొంతకాలంగా ఫామ్‌లేమితో స్టార్ బ్యాటర్ సతమతం
- ఈ మ్యాచ్ ద్వారా ఎట్టకేలకు గాడిలో పడటంతో రాహుల్ భార్య అథియా శెట్టి హర్షం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (77)తో రాణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న రాహుల్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ఒకనొక దశలో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. దాంతో బీజీటీకి రాహుల్‌ను ఎంపిక చేయడం పట్ల పలువురు పెదవి విరిచారు కూడా.
అయితే, ఇప్పుడు ఫామ్ అందుకున్న అతడు మునుపటి రాహుల్‌ను గుర్తుచేస్తూ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిసి రికార్డు స్థాయిలో 201 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించాడు. తద్వారా 1986లో సిడ్నీలో సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ నెలకొల్పిన 191 పరుగుల మునుపటి రికార్డును ఈ జోడి అధిగమించింది. జైస్వాల్, రాహుల్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాలో భారతదేశం తరఫున అత్యధిక ఓపెనింగ్ స్టాండ్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా రాహుల్ భార్య, బాలీవుడ్ నటి అథియా శెట్టి తన భర్తపై ప్రశంసలు కురిపించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో భర్తను ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. పెర్త్‌లోని ఆప్టన్ క్రికెట్ గ్రౌండ్‌లోని రాహుల్ ఫొటో పంచుకున్నారు. దీనికి "ఎప్పటికీ ఆశ వదులుకోని వ్యక్తి. ఎన్నటికీ వెనక్కి తగ్గనివాడు" అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక పెర్త్ టెస్టులో భారత్ పట్టుబిగించిందనే చెప్పాలి. మూడో రోజు భోజన విరామానికి భారత్ 320కి చేరింది. ఓవర్‌నైట్ స్కోర్ 172/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడుతోంది. దీంతో ఈరోజంతా ఆడి ఆతిథ్య జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.