తొలిరోజు వేలం త‌ర్వాత 10 జ‌ట్ల వ‌ద్ద ఉన్న ఆట‌గాళ్లు.. ఆయా జ‌ట్ల వ‌ద్ద మిగిలిన ప‌ర్సు విలువ‌లు ఇలా..

  • తొలిరోజు అమ్ముడుపోయిన‌ మొత్తం 72 మంది ఆట‌గాళ్లు
  • వారిని కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ. 467.95 కోట్లు వెచ్చించిన 10 జ‌ట్లు
  • పంజాబ్ కింగ్స్ అత్య‌ధికంగా 10 మంది ఆట‌గాళ్ల‌ కొనుగోలు
  • కేవలం న‌లుగురిని మాత్ర‌మే కొన్న ముంబ‌యి ఇండియ‌న్స్
ఐపీఎల్ మెగా వేలం తొలిరోజు మొత్తంగా 84 మంది ఆట‌గాళ్లు వేలానికి రాగా, 72 మంది మాత్ర‌మే అమ్ముడుపోయారు. 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు. ప‌ది జ‌ట్లు 72 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ. 467.95 కోట్లు వెచ్చించాయి. పంత్ రికార్డు స్థాయి రూ. 27 కోట్ల‌కు అమ్ముడుపోవ‌డం విశేషం. 

ఇక‌ పంజాబ్ కింగ్స్ అత్య‌ధికంగా 10 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. ముంబ‌యి ఇండియ‌న్స్ అత్య‌ల్పంగా కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే కొనుగోలు చేసింది. తొలిరోజు వేలం త‌ర్వాత 10 జ‌ట్ల వ‌ద్ద ఉన్న ఆట‌గాళ్లను ప‌రిశీలిస్తే...

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)
రిష‌భ్ పంత్, నికోల‌స్ పూర‌న్, మ‌యాంక్ యాద‌వ్, ర‌వి బిష్ణోయ్‌, అవేశ్ ఖాన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, స‌మ‌ద్‌, ఆయూశ్ బ‌దోనీ, మొహ్సీన్ ఖాన్‌, మిచెల్ మార్ష్‌, మార్క్‌ర‌మ్‌, జుయ‌ల్‌

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)  
శ్రేయాస్ అయ్యర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, మార్క‌స్ స్టొయినిస్‌, శ‌శాంక్ మ‌నోహార్‌, వ‌ధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ప్ర‌భ్‌సిమ్ర‌న్‌, వైశాఖ్‌, య‌శ్ ఠాకూర్‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, విష్ణు వినోద్‌

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)
సంజూ శాంస‌న్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, ధ్రువ్ జురెల్‌, రియాన్ ప‌రాగ్‌, జోఫ్రా ఆర్చ‌ర్, హెట్మెయిర్‌, హ‌స‌రంగ‌, మ‌హీశ తీక్ష‌ణ‌, సందీప్ శ‌ర్మ‌, మ‌ధ్వాల్‌, కుమార్ కార్తికేయ‌

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)
వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ ర‌స్సెల్‌, వ‌రుణ్‌, సునీల్ న‌రైన్‌, నోకియా, హ‌ర్షిత్ రాణా, క్వింట‌న్ డికాక్‌, ర‌ఘువంశీ, ర‌మ‌ణ్‌దీప్‌, మార్కండే, గుర్బాజ్‌, వైభ‌వ్‌

ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ)
కేఎల్ రాహుల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, మిచెల్ స్టార్క్‌, కుల్దీప్ యాద‌వ్‌, మెక్‌గుర్క్‌, న‌ట‌రాజ‌న్‌, స్ట‌బ్స్‌, హ్యారీ బ్రూక్‌, అశుతోశ్, పోరెల్‌, మోహిత్ శ‌ర్మ‌, క‌రుణ్ నాయ‌ర్‌, రిజ్వీ

గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)
శుభ్‌మ‌న్ గిల్‌, ర‌షీద్ ఖాన్‌, జాస్ బట్ల‌ర్‌, క‌సిగొ ర‌బాడ‌, సాయి సుద‌ర్శ‌న్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, షారుఖ్ ఖాన్, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, అనూజ్ రావ‌త్‌, మాన‌వ్‌, లోమ్రోర్‌, నిషాంత్‌, కుషాగ్రా

ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)
హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రా, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌, ట్రెంట్ బౌల్ట్‌, న‌మ‌న్ ధీర్‌, రాబిన్ మింజ్‌, క‌ర‌ణ్ శ‌ర్మ‌

చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)
రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఎంఎస్ ధోనీ, శివం దూబే, నూర్ అహ్మ‌ద్‌, ప‌తిర‌ణ‌, ర‌చిన్ ర‌వీంద్ర‌, ర‌వింద్ర అశ్విన్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్, కాన్వే, రాహుల్ త్రిపాఠీ, విజ‌య్ శంక‌ర్‌

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)
విరాట్ కోహ్లీ, హేజిల్‌వుడ్‌, సాల్ట్‌, ప‌టీదార్‌, జితేశ్ శ‌ర్మ‌, లివింగ్‌స్టోన్‌, ర‌సిఖ్‌, య‌శ్ ద‌యాళ్, సుయాశ్‌

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)
క్లాసెన్‌, అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిష‌న్‌, నితీశ్‌, అభిన‌వ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, రాహుల్ చాహ‌ర్‌, ఆడం జంపా, అథ‌ర్వ‌, సిమ‌ర్‌జీత్‌

ప‌ది జ‌ట్ల వ‌ద్ద మిగిలిన ప‌ర్సు విలువ‌లు ఇలా..
  • రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు- రూ. 30.65 కోట్లు
  • ముంబ‌యి ఇండియ‌న్స్- రూ. 26.10 కోట్లు
  • పంజాబ్ కింగ్స్- రూ. 22.50 కోట్లు
  • గుజ‌రాత్ టైటాన్స్- రూ. 17.50 కోట్లు
  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్- రూ. 17.35 కోట్లు
  • చెన్నై సూప‌ర్ కింగ్స్‌- రూ. 15.60 కోట్లు
  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌- రూ. 14.85 కోట్లు
  • ఢిల్లీ క్యాపిట‌ల్స్‌- రూ. 13.80 కోట్లు
  • కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్- రూ. 10.05 కోట్లు
  • స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌- రూ. 5.15 కోట్లు


More Telugu News