ఐపీఎల్ వేలం కోసం నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్ ధర ఎంతో తెలుసా?

  • బ్లూ సూట్ ధరించి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న ముంబై ఇండియన్స్ ఓనర్
  • ఈ సూట్ రేటు ఏకంగా రూ.78 వేలు పైమాటే
  • ధర తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు 
ఐపీఎల్ మెగా వేలం-2025 మొదటి విడత ప్రక్రియ నిన్న (ఆదివారం) ముగిసింది. అంచనాలను నిజం చేస్తూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.5 కోట్లు పలికారు. మరికొందరు ప్రతిభావంతులైన క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. కాగా ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల విక్రయంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన నీలం రంగు ప్యాంట్‌సూట్ అందరినీ ఆకర్షించింది.

ఆమె ధరించిన ఈ ప్యాంట్‌సూట్ రేటు అక్షరాలా 950 డాలర్లు. ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ సూట్ భారతీయ కరెన్సీలో దాదాపు రూ.78 వేలు ఉంటుంది. ఈ సూట్‌ ప్రైస్ ట్యాగ్‌ను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు. కాగా నిన్న జరిగిన ఐపీఎల్ వేలానికి నీతా అంబానీ సన్ గ్లాసెస్, ఆకర్షణీయమైన డైమండ్ చెవిపోగులు, ప్రత్యేక ఉంగరాన్ని ధరించి వచ్చారు. ఆమె ధరించిన వాచ్, హీల్స్‌ కూడా ప్రత్యేకంగా అనిపించాయి. ఆమె చేతిలో విలాసవంతమైన ఒక హ్యాండ్‌బ్యాగ్ కూడా కనిపించింది. కాగా నీతా అంబానీ దుస్తుల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారన్న విషయం తెలిసిందే.


More Telugu News