'మెకానిక్ రాకీ' మూవీ మండే టాక్!

  • ఈ నెల 22న విడుదలైన సినిమా 
  • ఆశించినస్థాయిలో లేని రెస్పాన్స్
  • ఎంటర్టైన్ మెంట్ తగ్గిందంటున్న ఫ్యాన్స్  
  • ఫస్టాఫ్ విషయంలో ఆడియన్స్ అసంతృప్తి

విష్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన 'మెకానిక్ రాకీ' ఈ నెల 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా మీనాక్షి చౌదరి నటించింది. సాధారణంగా విష్వక్సేన్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. చాలా థియేటర్స్ దగ్గర జనం చాలా పలచగా కనిపించారు. ట్రెండ్ కి దూరంగా సెట్ చేసిన టైటిల్ అందుకు మొదటి కారణమనే ఒక టాక్ వినిపిస్తోంది.

ఈ కథ ఫస్టాఫ్ వరకూ విన్నాక చేయడకూడదని అనుకున్నాననీ, కానీ సెకండాఫ్ విన్న తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నానని విష్వక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా చూసినవారు ఫస్టాఫ్ విషయంలో తమకి అదే అభిప్రాయం కలిగిందని అంటున్నారు. ఎక్కడో సెకండాఫ్ చివర్లో ఒక ట్విస్ట్ పెట్టేసి, అక్కడివరకూ కథను లాగుతూ వెళ్లడమే మైనస్ అయిందనే కామెంట్ చేస్తున్నారు.


ఈ కథలో గ్యారేజ్ ను కాపాడుకోవడం కోసం హీరో, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం హీరోయిన్ కష్టాలు పడటాన్నే వరుసగా చూపిస్తూ వెళ్లారనీ, దాంతో ఇద్దరి మధ్య ఆశించిన స్థాయిలో పడవలసిన లవ్ .. రొమాంటిక్ సీన్లు పడలేదనే టాక్ ఉంది. ఇక విష్వక్ ఎదుర్కొనే విలనిజం వీక్ గా ఉండటం పట్ల నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కథల ఎంపిక విషయంలో విష్వక్ మరింత కసరత్తు చేయాలనే మాట బలంగానే వినిపిస్తోంది మరి. 



More Telugu News