భవిష్యత్తులో యుద్ధాలన్నీ వీటితోనే జరుగుతాయి: ఎలాన్ మస్క్
- ఫైటర్ జెట్ విమానాలు పైలట్లను చంపేస్తున్నాయన్న మస్క్
- అయినా కొంత మంది యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని వ్యాఖ్య
- రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ లతో జరుగుతాయన్న మస్క్
ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్న తీరుపై టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ సహిత యుద్ధ విమానాలతో ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయని మస్క్ అన్నారు. ఈ ఫైటర్ జెట్ విమానాలు పైలట్లను చంపేస్తున్నప్పటికీ... కొంతమంది ఎఫ్-35 వంటి పైలట్లను చంపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని విమర్శించారు. ఈ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని చెప్పారు.
ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.