అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని కథలు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ
- అజ్ఞాతంలో ఉన్న ఆర్‌జీవీ కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు
- తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంట్వర్యూ ఇచ్చిన వర్మ
- తాను ఎక్కడికి పారిపోలేదని వివరణ
- ఒంగోలు పోలీసులు తనను అరెస్టు చేయడానికి రాలేదన్న ఆర్‌జీవీ
అజ్ఞాతంలో ఉన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను ఎవరికీ భయపడటం లేదని, సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతోనే పోలీసుల విచారణకు రావడంలేదని వివరించారు.
తాజాగా మరోసారి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం పోలీసులు వెతకడంపై ఆర్‌జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. ఒకవేళ తనను పోలీసులు అరెస్ట్ చేస్తే, జైల్లో కూర్చుని కథలు రాసుకుంటానని చెప్పుకొచ్చారు.
అలాగే ఒంగోలు పోలీసులు తనను అరెస్టు చేయడానికి రాలేదన్నారు. వాళ్లు కనీసం తన ఆఫీస్‌లోకి కూడా రాలేదని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పలువురు తనకు ఫోన్ చేసి పరామర్శించడం చేస్తున్నారని, అది నచ్చకే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశానని చెప్పుకొచ్చారు.