తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయి: ఆనం రామనారాయణరెడ్డి

  • భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం కల్పిస్తున్నామన్న ఆనం
  • వివాదాలు లేకుండా టీటీడీ పాలన కొనసాగుతోందని వ్యాఖ్య
  • మఠాలు వ్యాపారాత్మక ధోరణిలో ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గతంలో సామాన్య భక్తులకు అనేక ఇబ్బందులు ఉండేవని... ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. 

గతంలో తిరుమలలో ఎన్నో వివాదాలు ఉండేవని... ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా టీటీడీ పాలన కొనసాగుతోందని ఆనం తెలిపారు. ప్రతి నెల తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా? లేదా? అనేది పరిశీలిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామని తెలిపారు. మఠాలు వ్యాపారాత్మక ధోరణిలో ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు.


More Telugu News