చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
- బెయిల్ రద్దు పిటిషన్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్ గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. తాను ఢిల్లీలో లేనని... విచారణకు స్వయంగా హాజరు కావాలనుకుంటున్నానని, జనవరి వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను జనవరి రెండో వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.