వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందన

  • డిసెంబరు 1న వరల్డ్ ఎయిడ్స్ డే
  • ఎయిడ్స్ నిర్మూలన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న చంద్రబాబు
  • ఏపీలో 3.25 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని వెల్లడి 
నేడు (డిసెంబరు 1) వరల్డ్ ఎయిడ్స్ డే. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. "ఆనాడు నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం అని మొదలుపెట్టిన ప్రస్థానాన్ని... 2030 నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేద్దాం అనే సంకల్పం వరకు ముందుకు తీసుకెళ్లాలి. ఏపీలో 3.25 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని అంచనా. యువతలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ప్రజల్లో చైతన్యం, అందుబాటులో చికిత్స, 50 కి.మీ పరిధిలోని ఏఆర్టీ కేంద్రాలతో అనుసంధానం... ఎయిడ్స్ నియంత్రణలో ఇవి కీలక అంశాలు. కళంకం లేని ప్రపంచం దిశగా మన సంకల్పాన్ని పునరుద్ధరించుకుందాం... ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, హుందాతనం అందించేందుకు కృషి చేద్దాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


More Telugu News