'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం'
- 2025 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
- 'గోదారి గట్టు మీద రామ చిలకవే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజాగా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గోదారి గట్టు మీద రామ చిలకవే' అంటూ సాగే ఈ పాటను ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రమణ గోగుల ఆలపించారు.
ప్రముఖ రచయిత భాస్కరభట్ల రాసిన ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా రమణ గోగుల హస్కీ వాయిస్ ఈ పాటకు యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట పాడటం విశేషం. ఇక ఈ సాంగ్‌లో వెంకీ, ఐశ్వర్య రాజేశ్ తమదైన డ్యాన్స్ స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది.
ఈ పాట ఈ మూవీ ఆల్బమ్‌లోనే తన ఫేవరెట్ అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. కచ్చితంగా ఈ సాంగ్ మీచేత థియేటర్లలో డ్యాన్స్ చేయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.